Monday, January 10, 2011

yellow cucumber pickel - దోస ఆవకాయ



కావలసిన పదార్థాలు:
దోసకాయ - 1 cup
కారం - 1 tea spoon
ఉప్పు - 1 tea spoon
పసుపు - చిటికెడు
నూనె - 2 tea spoons
 వాము - 0.5 tea spoon

తయారు చేసే పద్దతి:
  • దోసకాయను సన్న ముక్కలుగా కోసుకోవాలి. (చెక్కు తీయకుండా)
  • అందులో కారం, ఉప్పు, పసుపు, వాము, నూనె వేసి కలపాలి.
గమనిక:
  • ఈ ఊరగాయ ఐదు నిమిషాల్లో తయారు అవుతుంది. గంట ఊరితే మంచి రుచి వస్తుంది. 
  • ఇందులో వాము బదులు ఆవపిండి వేసుకోవచ్చు. కాకపోతే ఊరడానికి ఒక రోజు పడుతుంది.

Sunday, January 9, 2011

కారం పొడుము

   కావలసిన పదార్థాలు:
పుట్నాల పప్పు - 1.5 cup
ఎండుమిర్చి - 10
ఉప్పు - 1 tea spoon
జీలకర్ర - 1 tea spoon
వెల్లుల్లి - 10 రెబ్బలు
తయారుచేసే పదార్థాలు:
  • పుట్నాల పప్పు పొడుము పట్టి జల్లించి పక్కన పెట్టుకోవాలి.
  • ఎండుమిర్చి మూకుడులో నూనె లేకుండా వేయించాలి.
  • చల్లారాక ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా mixy పట్టి ఇందాక పక్కన పెట్టుకున్న పొడుము వేసి, అందులో వెల్లుల్లి వేసి ఇంకొకసారి mixy పట్టాలి.
  • వెల్లుల్లి చిన్నచిన్న రెబ్బలుగా ఉన్నా పరవాలేదు.
  • ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోవాలి.
గమనిక:
  • ఈ పొడుము పెరుగు అన్నం లోకి బాగుంటుంది.
  • అన్నంలో నెయ్యి వేసుకున్న బాగుంటుంది.
  • చట్నీ చేయడానికి కుదరకపోతే ఈ పొడుము లో నీళ్ళు కలుపుకుంటే చట్నీ లాగా ఉంటుంది. కొంచం నిమ్మరసం  పిండుకుంటే రుచి గా ఉంటుంది. ఇందులోకి తాలింపు కూడా అవసరం ఉండదు.

Friday, January 7, 2011

పప్పుల కారప్పొడి

కావలసిన పదార్థాలు:
 పచ్చి సెనగపప్పు - 4 టీ స్పూన్స్
ఛాయ మినప్పప్పు - 4 టీ స్పూన్స్
పెసర పప్పు - 4 టీ స్పూన్స్
పుట్నాల పప్పు - 4 టీ స్పూన్స్
కారప్పొడి (తయారీ పద్దతికి 'కారప్పొడి' అనే  blog post చూడండి)

తయారు చేసే పద్దతి:
  • పైనవన్నీ మూకుడులో దోరగా వేయించుకోవాలి. (నూనె లేకుండా, sim లో ఉంచి)
  • చల్లారనిచ్చి బరకగా mixy పట్టాలి.
  • ఇందులో ముందుగ తయారు చేసుకున్న కారప్పొడి వేసి తరువాత ఒకసారి తిప్పాలి. 
గమనిక :
ఈ కొలతలు 'కారప్పొడి' blog లో చెప్పిన కొలతలకి సరిపోతాయి.

కారప్పొడి


కావలసిన పదార్థాలు:
ఎండుమిర్చి - 10
కరివేపాకు - 1 cup
చింతపండు - 10 రెబ్బలు
ధనియాలు - 1/2 cup
ఛాయా  మినప్పప్పు - 1/2 cup
వెల్లుల్లి - 10 రెబ్బలు
పసుపు - 1/4 టీ స్పూన్
ఉప్పు  - 1.5 లేదా 2 టీ స్పూన్స్
జీలకర్ర - 1 టీ స్పూన్
నూనె - 4 టీ స్పూన్స్

తయారు చేసే పద్దతి:
  • మూకుడులో నూనె వేసి కాగనిచ్చి sim లో పెట్టాలి.
  • అందులో ఎండుమిర్చి వేయాలి. రెండు నిమిషాలకి దోరగా వేగుతాయి.
  • దోరగా వేగాక వాటిని నూనె లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • తరువాత నూనెలో ఛాయమినప్పప్పు వేసి దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
  • మిగిలిన నూనె లో ధనియాలు వేసి వేయించాలి.
  • కొంచం ఎర్రగా వేగిన తరువాత కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసి వేయించి stove off చేయాలి.
  • వాటిని మూకుడులో అలాగే ఉంచి చల్లరనిస్తే కరివేపాకు గట్టిపడుతుంది.
  • చింతపండు, వెల్లుల్లి తప్ప మిగిలినవి అన్ని మెత్తగా mixy  పట్టాలి.
  • అందులో చింతపండు, వెల్లుల్లి వేసి తరువాత mixy పట్టాలి.
  • mixy పట్టాక పులుపు, ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి.
గమనిక:
  • mixy లో చింతపండు వేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  • నూనె లో నుంచి అన్ని తీయడానికి బెజ్జాల గరిట వాడితే నూనె రాకుండా ఉంటుంది.
  • ఈ పొడుము ఇడ్లికి, వేడి అన్నంలోకి, మజ్జిగ లోకి చాలా రుచిగా ఉంటుంది.

    Friday, December 31, 2010

    Black-Eyed Peas Roti - అలసందల రొట్టి

     కావలసిన పదార్థాలు:
    బియ్యం పిండి - 3 cups
    అలసందలు - 1 cup
    ఉప్పు - 1 tea spoon (5g)







    తయారుచేసే పద్దతి:
    • అలసందలు కడిగి 4 cups నీళ్ళు పోసి cooker లో ఉడికించాలి.
    • ఉడికిన తరువాత నీళ్ళు వార్చేయాలి.
    • ఉడికిన అలసందలను బియ్యం పిండిలో పోసి,  ఉప్పు వేసి కలపాలి.
    • 3 cups నీళ్ళు మరగపెట్టాలి.
    • ఇందాక కలుపుకున్న బియ్యం పిండిలో కొంచం కొంచం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి.
    • పిండిని ఉండలుగా  చేసుకొని, రొట్టి లాగ వత్తుకోవాలి.
    • pan  లో 2 spoons నూనె పోసి  sim లో ఉంచి, అందులో రొట్టి వేసి మూత పెట్టాలి.
    • ఒక నిమిషం తరువాత మూత తీసి తిరగవేయాలి.
    • వేగిన తరువాత తీసేయాలి.

    Sunday, December 26, 2010

    moong dal pongal - పప్పు పొంగలి

    కావలసిన పదార్థాలు:
    బియ్యం - 1 cup
    పెసర పప్పు  - 1/2 cup 
    నీళ్ళు - 4 cups
    జీడిపప్పు - 10
    అల్లం - చిన్న ముక్క (చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి)
    పచ్చి మిర్చి - 1 (చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి)
    మిరియాలు - 1/2 tea spoon (semi-smashed)
    జీలకర్ర - 1/2 tea spoon
    నూనె - 1 tea spoon
    నెయ్యి - 2 tea spoon
    ఉప్పు -  1/2 tea spoon

    తయారు చేసే పద్దతి:
    • బియ్యం, పెసరపప్పు కలిపి, కడిగి ఉంచాలి.
    • cooker లో నెయ్యి, నూనె వేసి sim లో ఉంచి  వేడి చేయాలి.
    • sim లోనే ఉంచి, అందులో  జీడిపప్పు, జీలకర్ర, మిరియాల పొడి వేసి 1 నిమిషం వేయించాలి.
    • ఆ తరువాత అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి 1 నిమిషం వేయించాలి.
    • ఇందులో నీళ్ళు పోసి ఉప్పు వేసి నీళ్ళు మరిగాక, కడిగిన బియ్యం-పెసరపప్పు వేసి 3 vissles రానివ్వాలి.
    గమనిక:
    • నీళ్ళు పోసాక ఉప్పు సరిపోయిందో లేదో చూసి తక్కువైతే వేసుకోవాలి.
    • తినే కారాన్ని బట్టి అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు పెంచుకోవచ్చు.
    • ఇందులోకి కొబ్బరి చట్నీ లేదా టమాటా పచ్చడి బాగుంటుంది.