Friday, December 31, 2010

Black-Eyed Peas Roti - అలసందల రొట్టి

 కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి - 3 cups
అలసందలు - 1 cup
ఉప్పు - 1 tea spoon (5g)







తయారుచేసే పద్దతి:
  • అలసందలు కడిగి 4 cups నీళ్ళు పోసి cooker లో ఉడికించాలి.
  • ఉడికిన తరువాత నీళ్ళు వార్చేయాలి.
  • ఉడికిన అలసందలను బియ్యం పిండిలో పోసి,  ఉప్పు వేసి కలపాలి.
  • 3 cups నీళ్ళు మరగపెట్టాలి.
  • ఇందాక కలుపుకున్న బియ్యం పిండిలో కొంచం కొంచం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి.
  • పిండిని ఉండలుగా  చేసుకొని, రొట్టి లాగ వత్తుకోవాలి.
  • pan  లో 2 spoons నూనె పోసి  sim లో ఉంచి, అందులో రొట్టి వేసి మూత పెట్టాలి.
  • ఒక నిమిషం తరువాత మూత తీసి తిరగవేయాలి.
  • వేగిన తరువాత తీసేయాలి.

Sunday, December 26, 2010

moong dal pongal - పప్పు పొంగలి

కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 cup
పెసర పప్పు  - 1/2 cup 
నీళ్ళు - 4 cups
జీడిపప్పు - 10
అల్లం - చిన్న ముక్క (చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి)
పచ్చి మిర్చి - 1 (చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి)
మిరియాలు - 1/2 tea spoon (semi-smashed)
జీలకర్ర - 1/2 tea spoon
నూనె - 1 tea spoon
నెయ్యి - 2 tea spoon
ఉప్పు -  1/2 tea spoon

తయారు చేసే పద్దతి:
  • బియ్యం, పెసరపప్పు కలిపి, కడిగి ఉంచాలి.
  • cooker లో నెయ్యి, నూనె వేసి sim లో ఉంచి  వేడి చేయాలి.
  • sim లోనే ఉంచి, అందులో  జీడిపప్పు, జీలకర్ర, మిరియాల పొడి వేసి 1 నిమిషం వేయించాలి.
  • ఆ తరువాత అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి 1 నిమిషం వేయించాలి.
  • ఇందులో నీళ్ళు పోసి ఉప్పు వేసి నీళ్ళు మరిగాక, కడిగిన బియ్యం-పెసరపప్పు వేసి 3 vissles రానివ్వాలి.
గమనిక:
  • నీళ్ళు పోసాక ఉప్పు సరిపోయిందో లేదో చూసి తక్కువైతే వేసుకోవాలి.
  • తినే కారాన్ని బట్టి అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు పెంచుకోవచ్చు.
  • ఇందులోకి కొబ్బరి చట్నీ లేదా టమాటా పచ్చడి బాగుంటుంది.

Saturday, December 25, 2010

chilly shallow fry - పొడుము పచ్చిమిర్చి



 కావలసిన పదార్థాలు:
బజ్జి పచ్చి మిర్చి - 8
పుట్నాల పొడుము - 1 cup
నూనె - 3 tea spoons
ఉప్పు - 1/2 tea spoon (1 tea spoon = 5 grams)
తయారుచేసే పద్దతి:
  • పుట్నాల పొడుములో 2 spoons నూనె, ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • బజ్జి పచ్చి మిర్చి చీల్చి అందులోగింజలు తీసేయాలి.
  • ఇలా చేసిన మిర్చిలో తయారు చేసుకున్న పొడుము నింపాలి.
  • pan లో ఒక స్పూన్ నూనె వేసి sim లో ఉంచి  పొడుముతో నింపుకున్న మిర్చిని అందులో పేర్చి మూత పెట్టాలి.
  • వేగిన (లైట్ బ్రౌన్ కలర్) మిర్చిలను తీసేసి, మిగిలినవి pan మధ్యలోకి రానివ్వాలి.
  • అన్ని వేగాక తిరగేసి ఒక నిమిషం ఉంచి, stove off చేయాలి. 

Friday, December 24, 2010

carrot chapathi - క్యారట్ చపాతీ


కావలసిన పదార్థాలు:
గోధుమ  పిండి - 2 cups
క్యారట్   కోరు   - 2 cups
ఉల్లిపాయ (onion) - 2
పచ్చి మిర్చి - 2
కొబ్బరి  కోరు  - 1 cup
కొత్తిమీర తరుగు - 1/2 cup
ఉప్పు - 1/2 spoon

తయారు చేసే పద్దతి:
  • గోధుమ పిండి, 1/2 స్పూన్ ఉప్పు కలిపి చపాతీ పిండి తయారు చేసుకోవాలి.    
  • పచ్చి మిర్చి, ఉప్పు కలిపి grind చేసుకోవాలి.
  • ఉల్లిపాయని రెబ్బలుగా grind చేసుకోవాలి. 
  • క్యారట్ కోరు, కొబ్బరి  కోరు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, grind చేసుకున్న మిశ్రమం కలిపి పెట్టుకోవాలి.
  • కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.
  • పిండితో  చిన్న చపాతీలు  చేసుకోవాలి.
  • ఒత్తిన చపాతిపైన క్యారట్ mix ని మధ్యలో పలచగా పెట్టి, చుట్టూ లైట్ గా నీళ్ళు రాసి పైన ఇంకొక చపాతీ పెట్టి వాటిని గట్టిగా అంటించాలి.
  • pan  పైన 1 స్పూన్ నూనె వేసుకొని sim లో మూత పెట్టి వేయించుకోవాలి.  
గమనిక:
  • క్యారట్ ని, కొబ్బరిని  కోరవచ్చు లేదంటే బరకగా grind చేసుకోవచ్చు.
  • అన్ని విడివిడిగా grind చేసుకోవాలి. లేకపోతే మెత్తగా అవుపోతాయి. 
  • రెండు  చపాతీలకు ఒక stuffed చపాతీ తయారవుతుంది.  

Thursday, December 23, 2010

coriander rice - కొత్తిమీర అన్నం

 2 members కోసం తయారీ

కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 cup
కొత్తిమీర - 1 cup (కోసినది)
నీళ్ళు - 2 cup
వెల్లుల్లి - 4 pieces
అల్లం - కొంచం
పచ్చి మిర్చి - 2
ఉప్పు - 1/2 టీ స్పూన్ (1 టీ స్పూన్ = 5 grams) 
నూనె - 1 టీ స్పూన్
నెయ్యి  - 1 టీ స్పూన్

తయారు చేసే పద్దతి:
  • బియ్యం కడిగి  రెండు కప్పుల నీళ్ళు పోసి అన్నం ఉడికించాలి (బిరుసుగా).
  • కడిగిన కొత్తిమీర, పచ్చి మిర్చి, వెల్లుల్లి, అల్లo, ఉప్పు కలిపి mixy పట్టాలి.
  • pan లో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి అందులో జీడిపప్పు వేయించాలి.
  • జీడిపప్పులు వేగాక stove ని sim లో ఉంచి ఇందాక mixy పట్టిన మిశ్రమాన్ని వేసి, నెయ్యి బయటకి వచ్చే దాక వేయించాలి.(౩ నిముషాలు)
  • తరువాత వేయించిన మిశ్రమాన్ని అన్నం లో వేసి కలపాలి. 

godhuma halwa - గోధుమ హల్వా

10 నిమిషములలో 4-6 members కోసం స్వీట్ తయారీ:

కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - 1 టీ కప్పు 
నెయ్యి - 1 టీ కప్పు
పంచదార (చెక్కెర) - 1 టీ కప్పు 
పాలు - 1.5 టీ కప్పు
జీడిపప్పు - 10

తయారు  చేసే పద్దతి:
  • non-stick pan లో నెయ్యి వేడి చేసి  జీడిపప్పు వేయించాలి.
  • జీడిపప్పు వేగిన తరువాత అలానే ఉంచి,  stove ని  sim లో  పెట్టి అందులో గోధుమ పిండి పోయాలి.
  • continuous గా  కలుపుతుండాలి.
  • 2 నిమిషాలకి కమ్మని వాసన మొదలవుతుంది.  అప్పుడు అందులో పాలు పోయాలి.
  • ఒకసారి దానిని కలిపి, అందులో పంచదార పోయాలి.
  • తిరిగి non-stop గా కలబెడుతూ ఉండాలి . 2 నిమిషాలకి నెయ్యి బయటకి వస్తుంది.
  • అప్పుడు stove off  చేయాలి.
గమనిక:
  • అన్ని గబగబా కలపాలి గనుక తయారికి కావలసినవన్ని ముందే కొలిచి పెట్టుకొంటే మంచిది.
  • గోధుమ పిండి కొంచం తక్కువ వేగిన పరవాలేదు, ఎక్కువ వేగితే మాడిపోయే అవకాశం ఉంది.
  • దీనిని 1 cup నెయ్యి బదులు 1/2 cup నెయ్యితో కూడా చేసుకోవచ్చు.

పరిచయం

నా పేరు దీప్తి. మా అత్త గారి వంటలు చాలా సులువుగా, రుచిగా, తక్కువ సమయంలో చేయొచ్చు. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి  ఉపయోగ పడుతాయని  బ్లాగ్ లో పెడుతున్నాను.