Friday, December 24, 2010

carrot chapathi - క్యారట్ చపాతీ


కావలసిన పదార్థాలు:
గోధుమ  పిండి - 2 cups
క్యారట్   కోరు   - 2 cups
ఉల్లిపాయ (onion) - 2
పచ్చి మిర్చి - 2
కొబ్బరి  కోరు  - 1 cup
కొత్తిమీర తరుగు - 1/2 cup
ఉప్పు - 1/2 spoon

తయారు చేసే పద్దతి:
  • గోధుమ పిండి, 1/2 స్పూన్ ఉప్పు కలిపి చపాతీ పిండి తయారు చేసుకోవాలి.    
  • పచ్చి మిర్చి, ఉప్పు కలిపి grind చేసుకోవాలి.
  • ఉల్లిపాయని రెబ్బలుగా grind చేసుకోవాలి. 
  • క్యారట్ కోరు, కొబ్బరి  కోరు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, grind చేసుకున్న మిశ్రమం కలిపి పెట్టుకోవాలి.
  • కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.
  • పిండితో  చిన్న చపాతీలు  చేసుకోవాలి.
  • ఒత్తిన చపాతిపైన క్యారట్ mix ని మధ్యలో పలచగా పెట్టి, చుట్టూ లైట్ గా నీళ్ళు రాసి పైన ఇంకొక చపాతీ పెట్టి వాటిని గట్టిగా అంటించాలి.
  • pan  పైన 1 స్పూన్ నూనె వేసుకొని sim లో మూత పెట్టి వేయించుకోవాలి.  
గమనిక:
  • క్యారట్ ని, కొబ్బరిని  కోరవచ్చు లేదంటే బరకగా grind చేసుకోవచ్చు.
  • అన్ని విడివిడిగా grind చేసుకోవాలి. లేకపోతే మెత్తగా అవుపోతాయి. 
  • రెండు  చపాతీలకు ఒక stuffed చపాతీ తయారవుతుంది.  

No comments:

Post a Comment