కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 cup
కొత్తిమీర - 1 cup (కోసినది)
నీళ్ళు - 2 cup
వెల్లుల్లి - 4 pieces
అల్లం - కొంచం
పచ్చి మిర్చి - 2
ఉప్పు - 1/2 టీ స్పూన్ (1 టీ స్పూన్ = 5 grams)
నూనె - 1 టీ స్పూన్
నెయ్యి - 1 టీ స్పూన్
తయారు చేసే పద్దతి:
- బియ్యం కడిగి రెండు కప్పుల నీళ్ళు పోసి అన్నం ఉడికించాలి (బిరుసుగా).
- కడిగిన కొత్తిమీర, పచ్చి మిర్చి, వెల్లుల్లి, అల్లo, ఉప్పు కలిపి mixy పట్టాలి.
- pan లో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి అందులో జీడిపప్పు వేయించాలి.
- జీడిపప్పులు వేగాక stove ని sim లో ఉంచి ఇందాక mixy పట్టిన మిశ్రమాన్ని వేసి, నెయ్యి బయటకి వచ్చే దాక వేయించాలి.(౩ నిముషాలు)
- తరువాత వేయించిన మిశ్రమాన్ని అన్నం లో వేసి కలపాలి.
No comments:
Post a Comment