Thursday, December 23, 2010

godhuma halwa - గోధుమ హల్వా

10 నిమిషములలో 4-6 members కోసం స్వీట్ తయారీ:

కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - 1 టీ కప్పు 
నెయ్యి - 1 టీ కప్పు
పంచదార (చెక్కెర) - 1 టీ కప్పు 
పాలు - 1.5 టీ కప్పు
జీడిపప్పు - 10

తయారు  చేసే పద్దతి:
  • non-stick pan లో నెయ్యి వేడి చేసి  జీడిపప్పు వేయించాలి.
  • జీడిపప్పు వేగిన తరువాత అలానే ఉంచి,  stove ని  sim లో  పెట్టి అందులో గోధుమ పిండి పోయాలి.
  • continuous గా  కలుపుతుండాలి.
  • 2 నిమిషాలకి కమ్మని వాసన మొదలవుతుంది.  అప్పుడు అందులో పాలు పోయాలి.
  • ఒకసారి దానిని కలిపి, అందులో పంచదార పోయాలి.
  • తిరిగి non-stop గా కలబెడుతూ ఉండాలి . 2 నిమిషాలకి నెయ్యి బయటకి వస్తుంది.
  • అప్పుడు stove off  చేయాలి.
గమనిక:
  • అన్ని గబగబా కలపాలి గనుక తయారికి కావలసినవన్ని ముందే కొలిచి పెట్టుకొంటే మంచిది.
  • గోధుమ పిండి కొంచం తక్కువ వేగిన పరవాలేదు, ఎక్కువ వేగితే మాడిపోయే అవకాశం ఉంది.
  • దీనిని 1 cup నెయ్యి బదులు 1/2 cup నెయ్యితో కూడా చేసుకోవచ్చు.

No comments:

Post a Comment